అతగాడు నాకు తెలుసు అనుకున్నానే
అణువణువు శోధించి మరి ఎన్నుకున్నానే
నా వాడేనని రాజముద్ర ఒకటి వేసానుగా
అయినా ... అదేమిటో
మధ్యాహ్నపు ఎండలా చిరచరలాడుతాడు
విసురైన గాలిలా చిటుక్కున తప్పుకుపోతాడు
ఎండమావిలా కనిపించి కనిపించకుండా మాయమవుతాడు
ఇంతకీ... నేనేమైనా
ఇంట్లో అద్దం అనుకున్నావా
వీధిలోని చెట్టనుకున్నావా
ఏం చేసినా ... చూస్తూ ఊరుకోడానికి
ఓయ్
జీవితంలో అన్ని అక్షరాలు
అచ్చంగా నీవే కాదుగా
ఇక..కాస్త
ఆకతాయి పనులు కట్టిపెట్టు